: సోనియాకు వెరైటీ గిఫ్ట్ ఇచ్చిన పొన్నం


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విభిన్నమైన కానుకను అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పొన్నం నేడు ఢిల్లీలో మేడమ్ ను కలిశారు. ఆమెకు అగ్గిపెట్టెలో పట్టే శాలువాను బహూకరించారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల ప్రాంతం చేనేత కార్మికులకు పెట్టిందిపేరు. దీంతో, తన ప్రాంత విశిష్టత ద్వారా మేడమ్ ను సంతోష పెట్టేందుకు ఆయన శాలువా కానుకగా ఇచ్చారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News