: తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. మూసీ నదిలో పడిపోయిన చిన్నారి


తల్లిదండ్రుల అనాలోచిత చర్య ఆ చిన్నారి పాలిట మృత్యువులా పరిణమించింది. హైదరాబాదులోని నాగోల్ వద్ద మూసీనదిలో మానవి అనే చిన్నారి జారి పడి గల్లంతైంది. వివరాల్లోకెళితే.. ఓ వైద్యుడు తన కుటుంబంతో ఆ వంతెన వద్దకు వచ్చారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో, వంతెన వద్ద రెయిలింగ్ పై తమ రెండేళ్ళ కుమార్తె మానవిని కూర్చోబెట్టి ఫొటోలు తీసేందుకు ఉపక్రమించాడా ఆ వైద్యుడు. కానీ, ఆ చిన్నారి పట్టుతప్పి నదిలో పడిపోయింది. ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ బాలికను వెదకడం కష్టమైంది. కాగా, ఈ వ్యవహారంలో పోలీసుల తీరు పలువురి ఆగ్రహానికి కారణమైంది.

  • Loading...

More Telugu News