: బాంబు పేలుళ్ల ప్రాంతాలను పరిశీలించిన ప్రధాని


హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల ప్రాంతాలను ప్రధాని మన్మోహన్ సింగ్ పరిశీలించారు. ఘటనలో పేలుడు జరిగిన తీవ్రతను, ఆ రోజు ఏం జరిగిందనే  విషయాన్నిసీఎం కిరణ్ మన్మోహన్ కు దగ్గరుండి  వివరించారు. దాదాపు పది నిమిషాల పాటు ఇక్కడ ఉన్న ప్రధాని కూడా పలు విషయాలను అడిగి తెలుసు కున్నారు.

అనంతరం ఇక్కడి నుంచి క్షతగాత్రులను పరామర్శించేందుకు ప్రధాని యశోద  ఆసుప్రతికి బయలుదేరి వెళ్లారు. ప్రధాని వెంట గవర్నర్ ఈఎస్ఎల్ఎన్ నరసింహన్, హోంమంత్రి సబిత, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఇతర మంత్రులు, అధికారులు ఉన్నారు. 

  • Loading...

More Telugu News