: రాజధానిని పంచే అధికారం కేంద్రానికి లేదు: ఏపీఎన్జీవో అశోక్


ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మరోమారు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యాహ్నం ఓ సభలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిని రెండు రాష్ట్రాలకు పంచే అధికారం కేంద్రానికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనం కోసమే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ విభజన నిర్ణయంతో రాజకీయ పార్టీలు ఇరుకున పడ్డాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రం కలిసుండాలని సీమాంధ్ర ప్రజలు తమ వాదనను బలంగా వినిపిస్తున్నారని కొనియాడారు.

  • Loading...

More Telugu News