: జలాంతర్గామిలో గల్లంతైన 18 మంది ఆచూకీ లేదు: నేవీ


ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో గల్లంతైన 18 మంది ఆచూకీ దొరకలేదు. నిన్న ఉదయం ముంబై తీరంలో జలాంతర్గామిలో పేలుళ్లు జరగడంతో నీట మునిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది సముద్రంలో దూకి ప్రాణాలు కాపాడుకోగా, 18 మంది జాడలేరు. నిన్న సాయంత్రం డైవర్లు నీట మునిగిన సింధు రక్షక్ లోకి ప్రవేశించినప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ దొరకలేదు. 18 మంది సెయిలర్ల జాడ ఇంకా లభించలేదని నేవీ ఈ ఉదయం ప్రకటించింది.

  • Loading...

More Telugu News