: మైనారిటీలకు బాషా సేవలు మరువలేనివి: విజయలక్ష్మి
టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్జాన్ బాషా ఆకస్మిక మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సౌమ్యుడైన లాల్జాన్ బాషా మరణం తన మనసుసు కలిచివేసిందని తెలిపారు. బాషా కుటుంబ సభ్యులకు విజయలక్ష్మి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మైనారిటీల అభ్యున్నతికి ఆయన చేసిన విశేష కృషిని ప్రశంసించారు.