: కాంగ్రెస్ పార్టీ భయపడిందంటున్న నాయిని


తెలంగాణ ప్రాంతంలో ఒక్కసీటూ దక్కదన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ విభజనకు పూనుకుందని టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. హైదరాబాదులోని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఆయన ప్రసంగించారు. విభజన క్రెడిట్ కాంగ్రెస్ కేమీ దక్కదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే, ఆ పార్టీకి ఇక్కడ ఉద్యమాలు చేసిన చరిత్రలేదని చెప్పుకొచ్చారు. ఇక, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాల్లో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన రాకపోవడం టీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించింది. వినోద్ మాట్లాడుతూ, హైదరాబాదుపై మెలిక పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేంద్రాన్ని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News