: మావోయిస్టులను మట్టుబెట్టిన తెలుగోడికి 'అశోక్ చక్ర'
తొమ్మిది మంది మావోయిస్టు కీలక నేతలను ఏరివేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రేహౌండ్స్ పోలీసు అధికారి కేఎల్వీఎస్ఎస్ హెచ్ఎన్వీ ప్రసాద్ బాబుకు మరణానంతరం దేశ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అశోక్ చక్ర దక్కింది. ఈసారి అశోక్ చక్ర అవార్డుకు ఎంపికైనది ప్రసాద్ బాబు ఒక్కరే. గ్రేహౌండ్స్ సబ్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న సమయంలో తన యూనిట్ తరఫున ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులను అంతమొందించారు. ఇందుకు గాను ఆయన పేరును అశోక్ చక్ర అవార్డుకు ఎంపిక చేసినట్లు రక్షణ శాఖ నుంచి ప్రకటన వెలువడింది. ఇక రెండో అత్యున్నత పురస్కారమైన కీర్తి చక్రకు ముగ్గురిని ఎంపిక చేయగా.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. మొత్తం 43 మంది ఈ సారి గ్యాలంటరీ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో పలువురికి మరణానంతరం దక్కాయి.