: సచిన్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు సిరీస్ మూడోరోజు ఆటలో టీమిండియా సచిన్ వికెట్ ను కోల్పోయింది. శనివారం చేసిన 71 వ్యక్తిగత స్కోరుతో ఆదివారం ఉదయం బ్యాటింగ్ కు దిగిన టెండుల్కర్ 81 పరుగుల వద్ద ఔటయ్యారు. ఆసిస్ బౌలర్ లియాన్ సచిన్ ను పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో సచిన్19 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నట్లయింది. అనంతరం ధోనీ క్రీజులోకి దిగి క్లోహ్లీ(58)తో జత కట్టాడు. ప్రస్తుతం భారత్ 4 వికెట్ల నష్టానికి 206 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.