: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని
67వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. బాపూఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించిన అనంతరం ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ స్వాగతం పలికారు. అనంతరం ఎర్రకోటపైకి చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ వేడుకలకు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.