: రాష్ట్ర విభజన అంశంపై ప్రధానికి లేఖ రాసిన విజయమ్మ
రాష్ట్ర విభజన అంశంపై వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. విభజన అంశంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రాని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని ఆ లేఖలో కోరారు. అందరికీ సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని విడగొట్టవద్దని వైకాపా, మజ్లీస్, సీపీఎం కోరుతున్నాయని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతుంటే ఏకాభిప్రాయం సాధించామని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు.