: 94,079 వార్తా పత్రికలు... 795 టీవీ ఛానెళ్లు


దేశవ్యాప్తంగా ప్రతిక్షణం ఏం జరుగుతోందో.. దేశ ప్రగతి ఎలా సాగుతుందో, సమస్యలు ఏ రీతిగా ఉన్నాయో ఎత్తి చూపడంలో మీడియా సంస్థల పాత్ర గణనీయమైనది. వీటి ప్రభావంతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో మన ముందు ప్రత్యక్షమవుతోంది. తప్పొప్పులు, అవినీతి అక్రమాలు, ఉద్యమాలు, నేతలు, ప్రజా స్పందనలు అన్నీ క్షణాల్లో తెలుసుకోవడానికి ప్రధాన కారకాలు వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్లు. రాజ్యసభలో చర్చ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్ని వార్తా సంస్థలు ఉన్నాయన్న వివరాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం, మన దేశంలో మొత్తం 94,079 వార్తా పత్రికలు జనజాగృతి కోసం పాటుపడుతున్నాయి. మొత్తం 795 టీవీ ఛానెళ్లు ఎంటర్ టైన్ మెంట్ తో పాటు, దేశ పరిస్థితుల్ని కళ్లకు కడుతుండగా, మొత్తం 242 ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు ఉన్నాయన్నారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక రూపంలో సమాధానం ఇస్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ ఈ వివరాలు వెల్లడించారు. 94,079 వార్తా పత్రికల్లో 12,117 దినపత్రికలు కాగా 81,962 పీరియాడికల్స్ అని తెలిపారు. వీటన్నింటి రీడర్ షిప్, వ్యూయర్ షిప్ లపై కూడా ప్రభుత్వం డేటా సేకరిస్తున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News