: ఆసీస్ బౌలర్లకు తలొగ్గిన భారత్-ఎ


లీగ్ మ్యాచ్ లలో అరివీర భయంకరంగా రెచ్చిపోయిన భారత్-ఎ జట్టు బ్యాట్స్ మెన్ నిర్ణాయక మ్యాచ్ లో విఫలమయ్యారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 'ఎ' జట్ల ముక్కోణపు టోర్నీ ఫైనల్లో.. పదునైన ఆసీస్ పేస్ బౌలింగ్ ధాటికి 49.2 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌటయ్యారు. మిడిలార్డర్ లో దినేశ్ కార్తీక్ 73, ఓపెనర్ ధావన్ 62 పరుగులు చేయడంతో ఆ స్కోరైనా సాధ్యమైంది. ప్రిటోరియాలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పిచ్ పేస్ కు అనుకూలించడంతో కంగారూ పేసర్లు హాజెల్ వుడ్ (3/31), కౌల్టర్ నైల్ (3/35) నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News