: 50 వేల మంది బాలికలకు ఉచితంగా సైకిళ్లు


పేద కుటుంబాల్లో బాలికలు అర్థాంతరంగా చదువు మానేయడాన్ని అరికట్టేందుకు త్రిపుర ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక రచించింది. ఈ ప్రణాళికలో భాగంగా దాదాపు 50 వేల మంది పేద విద్యార్థినులకు సైకిళ్లు అందజేయనుంది. చదువు కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి ఉండడంతో బాలికల శ్రమను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అగర్తలాలో వెల్లడించారు. ఇప్పటికే విద్యార్థులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News