: కేసీఆర్ కు బెదిరింపు లేఖపై కేసు
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వచ్చిన బెదిరింపు లేఖపై బంజారాహిల్స్ పీయస్ లో కేసు నమోదైంది. ఐపీసీ 506, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పదిరోజుల్లో కాల్చి చంపుతామంటూ టీఆర్ఎస్ భవన్ కు వచ్చిన లేఖపై ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.