: గర్భిణుల్లో థైరాయిడ్ హార్మోన్ తగ్గితే శిశువుకు ఆటిజం ముప్పు


గర్భంతో ఉన్నప్పుడు మహిళలలో థైరాయిడ్ హర్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోతే పుట్టే శిశువుకు ఆటిజం ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని హూస్టన్ మెథడిస్ట్ న్యూరోలాజికల్ ఇన్ స్టిట్యూట్ వైద్యులు మరికొందరితో కలిసి ఈ పరిశోధన నిర్వహించారు. 4,000 మంది తల్లులు, చిన్నారులను అధ్యయనం చేశారు. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి లోపాలున్న మహిళలు సాధారణం కంటే నాలుగు రెట్లు అధికంగా ఆటిజం పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉందని తేల్చారు.

మానసిక పరిపక్వత అభివృద్ధిలో లోపం (న్యూరల్‌ డెవలప్‌మెంట్‌ డిజార్డర్‌ )తో పుట్టే పిల్లలను ఆటిజం బాధితులుగా పేర్కొంటారు. వీరి ప్రవర్తన ఇతర చిన్నారుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇతర పిల్లలతో కలవలేరు, సరిగ్గా మాట్లాడలేరు. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. దీన్నే ఆటిజమ్‌ అంటారు.

  • Loading...

More Telugu News