: మిషెల్లే ఒబామా హిప్ హాప్ ఆల్బమ్
అమెరికా యువత ఆరోగ్యంగా ఉండేందుకు అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లే ఒబామా 'హిప్ హాప్' ఆల్బమ్ ను రూపొందిస్తున్నారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు. చిన్న వయసులోనే స్థూలకాయం బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించాలనే స్ఫూర్తిని యువతకు ఇచ్చే విధంగా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో 19 వీడియో పాటలు ఉంటాయి. మిషెల్లే కూడా కనిపించే ఈ ఆల్బమ్ సెప్టెంబర్ లో విడుదల కానుంది.