: ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలి: జానారెడ్డి
రాష్ట్ర విభజనవల్ల ఏపీఎన్జీవోలకు వచ్చే సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం ద్వారా పరిష్కరిస్తామని మంత్రి జానారెడ్డి చెప్పారు. కాబట్టి, సమ్మె విరమించి, విభజనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించి తెలుగుజాతి ఐక్యతకు కృషి చేయాలని కోరారు. సంయమనం పాటించి పరిస్థితులు ఆందోళనకరం కాకుండా చూడాలన్నారు. అభివృద్ధి దృష్ట్యా వ్యాపార, వాణిజ్య రంగాలలో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామన్నారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో భేటీ అయిన తెలంగాణ ప్రాంత మంత్రులు పలు విషయాలపై చర్చించారు. అనంతరం జానా మీడియాతో మాట్లాడుతూ..సీమాంధ్ర ఉద్యోగుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.