: వేములవాడ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు: హైకోర్టు
కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు పౌర ధ్రువీకరణ పత్రం ఇచ్చినందున ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయానికి చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఎన్నిక చెల్లదంటూ ఆదేశాలు జారీ చేయాలని శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తాజా తీర్పును వెలువరించింది.