: నేడు హైదరాబాదు వస్తున్న ప్రధాని


దిల్ షుఖ్ నగర్లో బాంబు పేలుళ్ళ ప్రదేశాన్ని సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు హైదరాబాదు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ లో ప్రత్యేక విమానంలో బయలుదేరి, 11.05కి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. వెంటనే అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సరూర్ నగర్లోని విక్టోరియా స్మారక గృహానికి చేరుతారు.

అక్కడి నుంచి కారులో వెళ్లి బాంబు పేలుళ్ళ ప్రదేశాన్ని పరిశీలిస్తారు. అనంతరం వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని ప్రధాని పరామర్శిస్తారు. 1.45కి ఆయన ఢిల్లీ తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని రాక సందర్భంగా నగరంలో పలు ప్రదేశాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  

  • Loading...

More Telugu News