: నిరూపించుకోవడానికి ఏమీ లేదు: సోనాక్షి సిన్హా
ఎవరి కోసమో.. ఏదో నిరూపించుకోవాలనో.. తాను సినిమాలు చేయనని బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా అంటోంది. నటన విషయంలో తనను ఎవరూ ఇంతవరకు వేలెత్తి చూపలేదని, మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకూ అన్ని చిత్రాలలోనూ బాగా చేశాననే అంటున్నారని తెలిపింది. 'సోనాక్షి బాగా నటిస్తుంది, బాగా డాన్స్ చేస్తుంది' అని అంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక తాను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని సోనాక్షి వ్యాఖ్యానించింది. దబాంగ్ చిత్రంతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన సోనాక్షి మూడు చిత్రాలకే పెద్ద పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.