: ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
జమ్మూకాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని సరిహద్దు భద్రతా దళాలు భగ్నం చేశాయి. కరన్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖను దాటే ప్రయత్నంలో ఉన్న ఉగ్రవాదులపై కాల్పులు జరపగా ఇద్దరు హతమయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.