: తిరుమలకు బస్సు సర్వీసులు షురూ
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని భక్తులకు రవాణా కష్టాలు తీరాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాలలో ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించడంతో నిన్న వేకువజాము నుంచి తిరుమలకు నిలిచిపోయిన బస్సులు.. మళ్లీ రాత్రి నుంచి కొండెక్కుతున్నాయి. టీటీడీ అధికారులు ఆర్టీసీ కార్మికులను ఒప్పించడంతో తిరుమలకు బస్సులు నడిపేందుకు మార్గం సుగమమైంది. దీంతో, నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ కొండపైకి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డ భక్తులకు ఉపశమనం కలిగింది. రాత్రి రెండే బస్సులు కొండపైకి నడిచాయి. ఈ ఉదయం నుంచి పరిమిత సర్వీసులు కొండపైకి భక్తులను తీసుకెళుతున్నాయి. కార్మికులు పూర్తిస్థాయిలో విధుల్లోకి చేరకపోవడం వల్లే సర్వీసులు పరిమితంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.