: జలాంతర్గామిలో అగ్ని ప్రమాదం
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి అగ్నిప్రమాదానికి గురైంది. ముంబై ఓడరేవులో నిలిపి ఉంచిన ఈ జలాంతర్గామిలో ఈ ఉదయం ఒక్కసారిగా మంటలు రేగాయి. ఈ ప్రమాదంలో 18 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు నేవీ ప్రతినిధి పీవీఎస్ సతీష్ చెప్పారు. వీరిలో ముగ్గురు అధికారులు ఉన్నట్లు సమాచారం. 16 ఫైర్ టెండర్లు కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. జలంతర్గామి సగం మేర దగ్ధమైంది. ప్రమాద సమయంలో జలాంతర్గామిలో చాలా మంది సెయిలర్లు ఉన్నారని, వారు వెంటనే నీళ్లలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై నేవీ విచారణకు ఆదేశించింది.