: గుండెపోటును గుర్తించే యాప్‌


ఇప్పుడు చాలావరకూ యాప్‌లు మన పనుల్లో చొరబడిపోతున్నాయి. అన్ని పనులకు అన్ని రకాలైన యాప్‌లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చక్కగా మన గుండె కొట్టుకోవడంలోని తేడాలను గుర్తించి, మనకు గుండెపోటు వచ్చే విషయాన్ని ముందుగానే గుర్తించి మనల్ని హెచ్చరించే ఒక కొత్తరకం యాప్‌ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకు మనం చేయాల్సిందల్లా మన జేబులో చక్కగా ఐఫోన్‌ వుంచుకుంటే చాలు...

సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్త యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్‌ మన గుండె కొట్టుకోవడంలోని తేడాలను గుర్తించి, మనకు గుండెపోటు రాకుండా కాపాడేలా రూపొందించారు. ఈ యాప్‌ పేరు అలివ్‌కార్‌ హార్ట్‌ మానిటర్‌. ఈ ఐఫోన్‌ యాప్‌ ఆటియల్‌ ఫిబ్రిల్లేషన్‌ (ఏఎఫ్‌)ను గుర్తిస్తుంది. దీనికి సరైన చికిత్స తీసుకుంటే గుండెపోటు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఏఎఫ్‌ అనేది వృద్ధుల్లో సాధారణంగా వచ్చే సమస్య. ఇలాంటి సమస్య కలిగినవారిలో ప్రతి ముగ్గురిలో ఒకరికి స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News