: అందుకే మీ శ్రీవారు సాయం చేయలేకపోతున్నారట
మీ శ్రీవారు ఇంటి పనుల్లో మీకు సాయం చేయాలని కోరుకుంటున్నా... మీ శ్రీవారు మాత్రం మీకు ఎలాంటి సాయం అందించడం లేదని మీకు కోపంగా కూడా ఉంటుంది. అయితే దీనికి కారణం ఆయన చేసే పని మాత్రమేనని తాజా అధ్యయనంలో తేలింది. సాధారణంగా కొందరు ఆడవాళ్లకు వారి భర్తలు ఇంటిపనుల్లో సాయం చేస్తుంటారు. మరికొందరు తమ భర్తలు తమకు ఎలాంటి సాయం చేయడం లేదని బాధపడుతుంటారు. దీనికి భర్తలు కారణం కాదని, వారు చేస్తున్న వృత్తే కారణమని ఒక పరిశోధనలో తేలింది.
యూనివర్సిటీ ఆఫ్ నోట్రే డేమ్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ఎలిజిబెత్ ఔరా మెక్‌క్లింటాక్ అనే పరిశోధకులురాలు ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో భర్తలు తమ భార్యలకు ఇంటి పనుల్లో సాయం చేయలేకపోవడానికి కారణం వారు చేస్తున్న వృత్తేనని తేలింది. భర్తలు చేస్తున్న వృత్తులు వారు తమ భార్యలకు ఇంటి పనుల్లో సాయం చేయడమా? లేదా? అన్న విషయంపై ప్రభావం చూపుతుందని ఎలిజబెత్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. మహిళా ప్రాధాన్యమున్న ఉపాధ్యాయ, నర్సింగు, శిశు సంరక్షణ వంటి వృత్తుల్లో ఉన్న పురుషులు సహజంగానే తమ భార్యలకు ఇంటి పనుల్లో సాయపడుతుంటారట. అలాకాకుండా మహిళా ప్రాధాన్యేతర వృత్తుల్లో ఉన్న భర్తలు తమ భార్యలకు ఇంటిపనుల్లో పెద్దగా సాయం చేయరని ఆమె చెబుతున్నారు.