: బీహార్లో అల్లర్లు.. కర్ఫ్యూ
బీహార్లోని నవడా పట్టణంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డు మీద ముగ్గురు స్థానికులపై దాడి చేసి కాల్పులకు తెగబడగా.. ఈ దాడిలో గాయపడ్డవారిలో ఒకరు సోమవారం మరణించారన్న వార్త ప్రచారం జరగడంతో అల్లర్లు మొదలయ్యాయి. బాధితుల్లో మరోవ్యక్తి ఈ రోజు మృతి చెందడంతో నవడాలో రెండు వర్గాల మధ్య అల్లర్లు నేడూ కొనసాగాయి. దీంతో పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడమే కాకుండా పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేశాయని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని గ్రహించి పట్టణంలో కర్ఫ్యూ విధించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.