: రేపు ఫేస్ బుక్ లో షారూఖ్ లైవ్ చాట్
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తన అభిమానులతో వినూత్నంగా ముచ్చటించేందుకు సిద్ధమవుతున్నాడు. షారూఖ్ తన తాజా చిత్రం 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్' విజయాన్ని ఫ్యాన్స్ తో పంచుకోనున్నాడు. రేపు ఉదయం 9 గంటలకు షారూఖ్ తో పాటు చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి కూడా ఫేస్ బుక్ లైవ్ లోకి రానున్నారు. facebook.com/iamsrk పేజిలో షారూఖ్ తన అభిప్రాయాలను పంచుకుంటాడని ఫేస్ బుక్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.