: అమెరికా అడుగుజాడల్లో కెనడా.. వర్క్ వీసాలు కష్టమే
గత దశాబ్ద కాలంగా కెనడాలో ఉద్యోగాల కోసం వలస వెళ్లిన భారతీయుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరే దేశం నుంచీ ఇంత ఎక్కువ సంఖ్యలో కెనడాకు వలస వెళ్లలేదు. అలాంటిది ఇప్పుడు ఆ దేశం కూడా అమెరికా బాటలో వర్క్ వీసా జారీ ప్రక్రియ కట్టుదిట్టం చేస్తోంది. విదేశీయులు స్వల్పకాలం కెనడాలో పనిచేయడానికి వీలుగా ఇచ్చే టెంపరరీ ఫారెన్ వర్కర్ ప్రోగ్రాం(టీఎఫ్ డబ్ల్యూపీ) నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం కోసమే ఈ ప్రయత్నమని అధికారులు పేర్కొంటున్నారు.