: ఆటోడ్రైవర్ అత్యుత్సాహం.. 12 మంది విద్యార్థినులకు గాయాలు


నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల వద్ద ఆటో బోల్తాపడిన ఘటనలో 12 మంది విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బాధితులను అదే రహదారిలో ప్రయాణిస్తున్న స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కాగా వారిలో నలుగురు విద్యార్థినుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరిని మెరుగైన వైద్యసేవల కోసం హైదరాబాద్ తరలించారు. తామంతా విహారయాత్రకు బయల్దేరినట్టు బాధితులు వెల్లడించారు. కాగా, ఆటోడ్రైవర్ అత్యుత్సాహంతో వేగంగా ఆటోను నడిపి, కంట్రోల్ చేయలేక బోల్తా కొట్టించాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

  • Loading...

More Telugu News