: మహాకుంభమేళాలో పెంచిన భద్రత
హైదరాబాద్ జంట పేలుళ్ల నేపథ్యంలో అలహాబాద్ మహాకుంభమేళాలో భద్రతను మరింత పెంచారు. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మార్చి 10వ తేదీ వరకు కొనసాగనున్న మహాకుంభమేళా ప్రదేశంలో పెద్ద ఎత్తున భద్రతను చేపట్టాలని హోం శాఖ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది .