: నాగాలాండ్, మేఘాలయా రాష్ట్రాల్లో 85 శాతం పోలింగ్


ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. మేఘాలయా రాష్ట్రంలో దాదాపు 85 శాతం పోలింగ్ నమోదయిందని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రశాంత్ నాయక్ తెలిపారు. 

నాగాలాండ్ లో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం నాలుగు గంటలకు నాగాలాండులో 83 శాతం పోలింగ్ నమోదయిందని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎన్ మోయా అయిర్ తెలిపారు.

  • Loading...

More Telugu News