: కిష్త్వాడ్ అల్లర్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశం


జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వాడ్ పట్ణణంలో మత ఘర్షణల నివారణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీం కోర్టు ఆదేశించింది. కిష్త్వాడ్ పట్టణంలో ఘర్షణల నివారణకు, అమర్ నాథ్ యాత్ర భక్తుల భద్రతకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని జమ్మూకాశ్మీర్ పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు భీమ్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం మత సామరస్యాన్ని, శాంతి భద్రతలను ప్రభుత్వ సిబ్బంది పరిరక్షిస్తారనే ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News