: ముంబయి ఫైవ్ స్టార్ హోటళ్ళలో మరాఠీ చానళ్లే చూపాలట!


ముంబయిలోని ఫైవ్ స్టార్ హోటళ్ళకు రాష్ట్ర భాష మరాఠీపై ప్రేమ తగ్గిపోతోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ) ఆరోపిస్తోంది. ఇకపై అక్కడి ఫైవ్ స్టార్ హోటళ్ళలో మరాఠీ వార్తా చానళ్లే చూపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ లకు ఎన్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జితేంద్ర అవహద్ ఓ లేఖ రాశారు. మరాఠీ రాష్ట్ర భాష అని, ద్వితీయ భాషగా పరిగణించవద్దని చెప్పారు. ఈ విషయంలో ఫైవ్ స్టార్ హోటళ్ళు రాష్ట్ర భాషను విస్మరించరాదని సూచించారు. అయితే, ఆ హోటళ్ళలో బస చేసేవారికి, తమకిష్టమైన చానళ్ళను వీక్షించే సౌలభ్యం ఉంటుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News