: దలైలామా వెబ్ సైట్ పై హ్యాకర్ల దాడి
బౌద్ధ మత ప్రధాన గురువు దలైలామా ఆధ్వర్యంలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ పై హ్యాకర్లు దాడి చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్ స్కై ల్యాబ్ పరిశోధకుడు కుర్ట్ బౌమ్ గార్టనర్ వెల్లడించారు. హ్యాకర్లు సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన చైనా భాషలోని వెబ్ సైట్ పై దాడి చేసి యూజర్ల కంప్యూటర్లలోకి వైరస్ ను ప్రవేశపెట్టారని తెలిపారు. దీని ద్వారా, ఈ సైట్ ను తరచూ సందర్శించే మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా వేయాలన్నది వారి వ్యూహంలా కనిపిస్తోందని చెప్పారు. వైరస్ ను గుర్తించి, తొలగించే వరకూ ఈ సైట్ కు దూరంగా ఉండాలని బౌమ్ గార్టనర్ సూచించారు.