: కృష్ణా జిల్లాలో నిలిచిన 1200 ఆర్టీసీ బస్సులు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో కృష్ణా జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మొత్తం 14 డిపోల పరిధిలో 1200 బస్సులు నిలిచిపోయాయి. జిల్లావ్యాప్తంగా ఈ సమ్మెలో 6,600 మంది ఆర్టీసీ కార్మికులు పాల్గొంటున్నారు. విజయవాడ బస్టాండు వద్ద ఈ ఉదయం ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు నిలిపివేతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు నేటినుంచి రెండు రోజులపాటు గుడివాడ బందుకు ఉద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది.