: పార్లమెంటు వద్దే తేల్చుకోవాలన్న యోచనలో సీమాంధ్ర నేతలు


సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ వ్యూహం మార్చారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు బదులుగా నేరుగా పార్లమెంటు భవనం ముందే ధర్నాకు దిగాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఢిల్లీలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంలో భేటీ అయిన సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ఈ మేరకు చర్చలు జరిపారు. జంతర్ మంతర్ అనేది నిత్యం ఎంతో మంది ధర్నా చేసే వేదిక అయినందున, అక్కడకు బదులుగా ఆందోళన తీవ్రతను తెలియజేసేందుకు పార్లమెంటు వద్దే ధర్నాకు దిగాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధినేత్రి సోనియా ఆగ్రహించినా సరే పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులుగా తమ ప్రాంతంలోని ప్రజాందోళనను తప్పకుండా పార్టీ అధిష్ఠానం పెద్దలకు వివరించి, సమైక్య రాష్ట్రం విషయంలో సర్ది చెప్పాల్సి ఉందని వారు మీడియాతో అన్నారు.

  • Loading...

More Telugu News