: సీమాంధ్రలో భగ్గుమంటున్న కూరగాయల ధరలు
గత అర్థరాత్రి నుంచి సీమాంధ్ర జిల్లాలలో ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రారంభం అయింది. దాదాపు 70 వేలమంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. పెట్రోల్ బంకులు కూడా మూతపడడంతో ఆ ప్రభావం కూరగాయల ధరలపై పడింది. బంద్ ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియక ఆందోళన చెందుతున్న ప్రజలు.. వారం, పది రోజులకు సరిపడా కూరగాయలను ముందే కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. టమోటాలు కిలో 80 రూపాయలు పలుకుతుంటే, పచ్చిమిర్చి 100 రూపాయలకు చేరింది. కిలో క్యారెట్ రూ.70, బెండ, దొండ కూడా రూ.70కు పైన పలుకుతున్నాయి.