: తొలిసారి తిరుమలకు నిలిచిన బస్సు సర్వీసులు
38 ఏళ్ళ తరువాత తొలిసారి తిరుమలకు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీకి సంబంధించిన 3 యూనియన్లు ఐకాసగా ఏర్పడి మంగళవారం సమ్మెకు దిగాయి. దీంతో తిరుమలకు వెళ్ళే సుమారు 500 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. తిరుమలకు వెళ్ళే ప్రైవేటు వాహనాలను కూడా నిలిపివేస్తామని కార్మిక సంఘాలు తెలిపాయి. దీంతో తిరుమలకు వెళ్ళే భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుంటున్నారు. ఈ రోజు తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య కూడ తగ్గింది. సమ్మె సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ, న్యాయసమ్మతమైన తమ సమస్యను దేశ, విదేశాలనుంచి తిరుమలకు వచ్చే భక్తులు దయతో అర్ధం చేసుకొని తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.