: ముఖ్యమంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు రంగారెడ్డి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సరూర్ నగర్ పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కోర్టు తెలిపింది. అనంతర విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది. ప్రజలను రెచ్చగొట్టేలా కిరణ్ వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది జనార్ధన్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.