: విడుదలకు నోచుకోని 'తలైవా'.. జయలలిత సాయాన్ని కోరిన విజయ్
తమిళ నటుడు విజయ్ నటించిన 'తలైవా'(తెలుగులో 'అన్న')చిత్రం విడుదలయ్యేందుకు అడ్డంకులు తొలగిపోలేదు. ఈ క్రమంలో తన చిత్రం రిలీజ్ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేశాడు. ఈ చిత్రం తమిళనాడులో రీలీజ్ కు సీఎం సహకరించాలన్నాడు. దయచేసి అభిమానులు సహనం వహించాలని ప్రకటనలో కోరాడు. తమిళనాడు తప్ప అన్ని ప్రాంతాల్లో ఈ నెల 9న ఈ చిత్రం విడుదలైంది.