: తెలంగాణ నిర్ణయంతో చిన్న రాష్ట్రాల డిమాండ్లకు ఊతం: బీపీఎఫ్
తెలంగాణపై నిర్ణయంతో దేశంలో చిన్న రాష్ట్రాల డిమాండ్లకు ప్రాతిపదిక దొరికిందని 'అస్సాం బోడో పీపుల్స్ ఫ్రంట్' (బీపీఎఫ్) పేర్కొంది. దీన్ని బట్టి బోడోలాండ్ సహా ఇతర రాష్ట్రాల డిమాండ్లు కూడా న్యాయ సమ్మతమైనవేనని అర్ధమవుతోందని ఆ పార్టీ సభ్యుడు విశ్వజిత్ దాల్మనీ అన్నారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తున్నామని, అయినా ఇప్పటివరకు స్పష్టమైన మార్గ సూచీ లేదన్నారు.