: రాబర్ట్ వాద్రా భూ వ్యవహారంలో దర్యాప్తు జరగాలి: కాంగ్రెస్ ఎంపీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వ్యవహారంపై ఆ పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. వాద్రా భూ వ్యవహారంలో తప్పకుండా సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని హర్యానాలోని గుర్గావ్ కాంగ్రెస్ ఎంపీ రావ్ ఇంద్రజిత్ సింగ్ డిమాండు చేశారు. ఈ వ్యవహారంలో దోషిగా తేలితే వాద్రాకు శిక్ష పడుతుందన్నారు. అయితే, ఇంద్రజిత్ సింగ్.. సోనియా అల్లుడిపై కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా? లేక, ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తే ఇతరుల నోటికి తాళం వేసినట్లు అవుతుందని ఇలా అన్నారా? అనేది సందిగ్ధంలో ఉంది. ఇప్పటికే వాద్రా విషయంలో దర్యాప్తు కోరినందుకు అశోక్ ఖేమ్కా అనే ఐఏఎస్ అధికారిపై ట్రాన్సఫర్ వేటు పడిన సంగతి తెలిసిందే. వాద్రా 3.5 ఎకరాలకు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారంటూ రెండు రోజుల కిందట ఖేమ్కా సంచలన ఆరోపణలు చేశారు.