: శంకర్రావును పరామర్శించిన కవిత
హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శంకర్రావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శంకర్రావు అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించినందుకుగాను.. డీజీపీ, శంకర్రావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు అసలు గ్రీన్ ఫీల్డ్స్ భూముల అంశంలో తన తండ్రి శంకర్రావుకు ఎలాంటి సంబంధం లేదని శంకర్రావు కుమార్తె సుస్మిత అన్నారు.