: ఢిల్లీ వెళుతున్నా.. కానీ, ధర్నాలో పాల్గొనను: మంత్రి డొక్కా
తాను సీమాంధ్ర శాసన సభ్యులతో పాటు ఢిల్లీ వెళుతున్నానని, కానీ, అక్కడి ధర్నాలో మాత్రం పాల్గొనబోనని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ మంత్రిగా ఉండి ధర్నాలో పాల్గొనడం సబబు కాదన్నారు. ఆంటోనీ కమిటీ ముందు తన వాదన వినిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.