: ఐఎన్ఎస్ విక్రాంత్ జాతికి అంకితం


పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ఈ రోజు జాతికి అంకితం చేశారు. కేరళలోని కొచ్చిలో 2006 నుంచి విక్రాంత్ ను రూపొందిస్తున్నారు. ఈ విమానవాహక నౌక 2016 నాటికి పరీక్షలకు సిద్ధం కానుండగా 2018 నాటికి నావికాదళంలోనికి చేరుతుంది. ప్రస్తుతానికి డెక్ పనులు పూర్తి కాగా, మిగిలిన పనులు పూర్తి చేస్తున్నారు. కొచ్చి నౌకాశ్రయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ను నౌకాయాన శాఖ మంత్రి జీకే వాసన్, నేవల్ చీఫ్ డీకే జోషీ సమక్షంలో రక్షణమంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ ప్రారంభించారు.

కాగా ఈ రకమైన భారీ యుద్ధనౌకలను నిర్మించే సామర్ధ్యం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలకు మాత్రమే ఉండగా విక్రాంత్ నిర్మాణంతో భారత్ కూడా సత్తా చాటింది. ఐఎన్ఎస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే నిర్మితమవడం విశేషం. దీని నిర్మాణానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తయారు చేసిన హైగ్రేడ్ ఉక్కును వాడారు.

  • Loading...

More Telugu News