: సాయంత్రం నుంచే సీమాంధ్ర రెవెన్యూ ఉద్యోగుల సమ్మె
సీమాంధ్ర రెవెన్యూ ఉద్యోగుల నిరవధిక సమ్మె ఈ సాయంత్రం నుంచే ప్రారంభం కానుంది. కార్యాలయాలకు తాళాలు వేసి ఆర్డీవోలకు అప్పగిస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు కూడా చేయబోమని, హాజరుకాబోమని ఆయా జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.