: కిష్త్వాడ్ లో ముస్లింల రక్షణలో హిందువుల పెళ్లి
అది, గత నాలుగు రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న జమ్మూలోని కిష్త్వాడ్ ప్రాంతం. ఇరు మతవర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం నుంచి అక్కడ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒక హిందువు పెళ్లి వేడుకకు ముస్లింలు రక్షణగా నిలవడం మతసామరస్యానికి నిలువుటద్దంలా భాసిల్లింది. పూచల్ ప్రాంతానికి చెందిన వైద్యుడు ఆశిష్ శర్మ వివాహానికి ఇరుగు పొరుగు ముస్లింలే రక్షణ కల్పించారు. వారి వల్లే తాను పెళ్లి చేసుకోగలిగానని వైద్యుడు ఆశిష్ సంతోషంతో ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.