: రాజ్యసభలో హరికృష్ణ నినాదాలు.. అరగంట వాయిదా


వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో ఎంపీ నందమూరి హరికృష్ణ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలంటూ హరికృష్ణ, మిగతా పార్టీ ఎంపీలతో గొంతు కలిపారు. పార్టీ ఎంపీలంతా స్పీకర్ వెల్ లోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అప్పటికే సభ రెండుసార్లు పునఃప్రారంభమైనా, ఏమాత్రం ముందుకు సాగలేదు. అటు కిష్త్వాడ్ ఘటనపై చర్చకు బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. సభాపతి ఎంత వారించినా వినకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో సభను అరగంట పాటు వాయిదా వేశారు. అటు లోక్ సభ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

  • Loading...

More Telugu News