: కిష్త్వాడ్ ఘర్షణలపై విచారణకు ఆదేశం
మూడు రోజుల కిందట జమ్మూకాశ్మీర్ లోని కిష్ త్వాడ్ పట్టణంలో చోటు చేసుకున్న మత ఘర్షణలపై తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. విచారణ ఓ రిటైర్ట్ జడ్జి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. దర్యాప్తు ముగిసిన తర్వాత నివేదికను బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ అంశంపై పార్లమెంటులో బీజేపీ తీవ్ర ఆందోళన చేయడంతో ఉభయసభల్లోనూ గందరగోళం నెలకొంది. గతవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. దాంతో, జమ్మూలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూను విధించడంతో పలు విద్యా సంస్థలను మూసివేశారు.